---Advertisement---

ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆఫీస్ లో కేసీఆర్ ఫోటో.. కండువా మారినా మనసు అక్కడే ఉందా?

By
On:
Follow Us

సంగారెడ్డి కాంగ్రెస్ లో జాయినింగ్ పాలిటిక్స్ రచ్చ రేపుతున్నాయి. పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ అంశం గజాగజలాడిస్తున్న చలిలోనూ రాజకీయాని హాట్ హాట్ గా మారుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేసిన గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అంటి ముట్టనట్లుగా వ్యవహారిస్తున్నారని కాటా వర్గం విమర్శలు గుప్పిస్తోంది. ఎమ్మెల్యే ఆఫీస్ లో కేసీఆర్ ఫోటో, కుర్చీలలు ఇంకా గులాబీ రంగులోనివే ఉన్నాయని దీన్ని బట్టే ఎమ్మెల్యే పైకి కాంగ్రెస్ లో చేరినా అయన మనసు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కేసుల భయంతోనే అయన పార్టీలో చేరారాని, అయన తీరు పై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలను ప్రభుత్వం,ప్రతిపక్షాలు ప్రతిష్టత్మాకంగా తీసుకుంటున్నాయి. ఇటువంటి తరుణంలో ఎమ్మెల్యే ఎటువైపో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఇలాగే టచ్ మీ నాట్ అనేలా వ్యవహారిస్తే అంతిమంగా కాంగ్రెస్ నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. దీంతో జిల్లాలోని మిగతా అన్నీ చోట్లో ఆల్ సెట్ అనుకున్న అధిష్టానానికి పటాన్ చేరు రాజకీయం కాస్త చికాకుగా మారినట్లు ప్రచారం జరుగుతోంది.

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Leave a Comment