---Advertisement---

ఎస్సీ వర్గీకరణపై అపోహాలు తొలగించే బాధ్యత మాదిగ మేధావులదే: మంత్రి దామోదర

By
Last updated:
Follow Us

National forum for Social justice in judiciary ఆధ్వర్యంలో  ‘SC Classification for Social Justice’ అంశంపై మాదిగ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణ ను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి  రాష్ట్రంలో అమలు చేస్తామని శాసనసభలో గంట వ్యవధిలో ప్రకటన చేశారన్నారు. శాసనసభ ప్రకటన అనంతరం ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి  అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఏకసభ్య కమిషన్ ను నియమించాలని చేసిన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పై జస్టిస్ షమిమ్ అక్తర్ గారిని నియమించారన్నారు. జస్టిస్ షమీం అక్తర్ క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని కులాల, సంఘాల, అసోసియేషన్ ల విజ్ఞప్తులను స్వీకరించి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, empirical data  ఆధారంగా ఏకసభ్య కమిషన్  జస్టిస్ షమీమ్ అక్తర్ వర్గీకరణ చేయటం జరిగిందన్నారు.

ఎస్సీ వర్గీకరణపై ప్రజల్లో ఉన్న అపోహాలన్నిటినీ తొలగించేందుకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన మేధావులు కృషి చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ ఒక్కటే జాతి అభివృద్ధికి దోహదం పడుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు విద్యా, ఉద్యోగ రంగాలలో అవకాశాలు లభిస్తాయన్నారు. వీటితో పాటు ఎస్సీ సబ్ ప్లాన్, భూ పరిరక్షణ చట్టాలు ద్వారా జాతి అభివృద్ధికి దోహదం పడుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణలో మాదిగ సామాజిక వర్గానికి 9.77 % రిజర్వేషన్లు లభించునున్నాయన్నారు. మాదిగ సామాజిక అనుబంధ కులాల లోని చిన్నచిన్న జాతుల జనాభా అభివృద్ధి కి దోహద పడాల్సిన గురుతర బాధ్యత మాదిగ సామాజిక మేధావులకు ఉన్నదన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ మాట్లాడుతూ ….ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అన్నారు. ఈ వర్గీకరణ అన్ని జాతుల వారికి సమాన అవకాశాలు కల్పిస్తుంది అన్నారు. వర్గీకరణ అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకమై రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ ఆకాంక్షించారు.

ప్రముఖ సామాజికవేత్త విశారదన్ మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఈనాడు వశీకరణ, వాల్మార్ట్ వ్యాపారంగా మారిందన్నారు. ఆనాడు సంత్ రవిదాస్ శిష్యులుగా బాబు జగ్జీవన్ రామ్ ఈ జాతి అభ్యున్నతి కోసం చేసిన సేవలే ఈనాడు వారి శిష్యులుగా ఈ జాతి కోసం ఎస్సీ వర్గీకరణ సాధించి పెట్టిన ఘనత రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహకు  దక్కిందన్నారు. ఎస్సీ వర్గీకరణ ను జస్టిస్ షమీమ్ అక్తర్  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఎంపిరికల్ డాటా ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో 100% అందరికీ న్యాయం జరిగిందని సామాజిక వేత్త విశాధరన్  వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఇన్ జ్యూడిషరీ సంస్థ కు చెందిన న్యాయవాదులు, సామాజికవేత్తలు, మాదిగ, మాదిగ అనుబంధం కులాల ఐక్యవేదిక చైర్మన్ మేడి పాపయ్య మాదిగ, ప్రొఫెసర్ మల్లేశం, కొండేటి మల్లయ్య, ముంజగల విజయ్ కుమార్,  బీమ్ రావు, మేరీ మాదిగ, కృపాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Leave a Comment