ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం మరో అదిరిపోయే స్కీమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మ్యూచ్ వల్ ఫండ్స్ ను మరింత మందికి చేరువ చేసేలా కొత్త ఎస్ఐపీ ని తీసుకువచ్చింది. జన్ నివేష్ పేరుతో కేవలం రూ. 250 తో ఎస్ఐపీ చేసుకునే ఛాన్స్ కల్పిస్తోంది. సెమీ అర్బన్ ప్రజలు,చిన్న మదుపర్లు టార్గెట్ గా ఈ స్కీమ్ తెచ్చినట్లు తెలిపారు. జనరల్ గా రూ.500 తో సిప్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మరింత తక్కువలో మదుపు చేసే వారికోసం చిన్న మొత్తంలొ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఎస్ బీఐ యోనో యాప్,పేటీఎం, గ్రో,జెరోధా వంటి ప్లాట్ ఫామ్ లలో ఈ స్కీమ్ అవైలబుల్ ఉంటుంది. డైలీ, వీక్, మంత్లీ ఇలా ఎవరి స్థోమతను బట్టి వారు సిప్ చేసుకోవచ్చు అని SBI తెలిపింది.