---Advertisement---

చంద్రబాబు సర్కార్ పై రేవంత్ హాట్ కామెంట్స్.. కేసీఆర్ కు చెక్ పెట్టేనా?

By
On:
Follow Us

తెలంగాణ,ఏపీ మధ్య జలవివాదం కీలక మలుపు తిరిగింది. ఏపీ ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను కలిశారు. అనంతరం మీడియతో మాట్లాడుతూ సెన్స్షనల్ కామెంట్స్ చేశారు. వీటి విషయంలో  ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి విమర్శలు ఫె్జ్ చేస్తున్న  తరుణంలో  సీఎం రేవంత్ రెడ్డి చేసిన  స్ట్రాంగ్ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారాయి. సీఎం మాట్లాడుతూతెలంగాణ నికరం జలాల వాట తేల్చిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు.  తెలంగాణ వాటా తేలనే లేదు. మరీ వరద నీటి ఆధారంగా ప్రాజెక్ట్ నిర్మిస్తునాం అని ఏపీ ఎలా వాదిస్తుందన్నారు. కృష్ణా జలాల విషయంలో ఏర్పడిన సమస్యలు గోదావరి ప్రాజెక్టుల విషయంలో ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఈ విషయంలొ ఎలాంటి శషబిషలు లేవని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల కేటాయింపులపై కేంద్ర మంత్రితో చర్చించామంని అన్నారు. ఏపీతో నీటి వాటాల విషయంలో తమ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందన్నారు. NDA ప్రభుత్వమే కేంద్రంలొ ఉన్నదని తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులకు ఏపీ ప్రభుత్వంలో కూడా చొరవ తీసుకోవాలన్నారు.

బీఆర్ఎస్ పై ట్రిగ్గర్:
ఏపీతో జల వివాదం అంశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య క్రెడిట్ పొలిటికల్ వార్ నడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతోందని, కొత్త ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ వాదన తప్పు అని కాంగ్రెస్ తిప్పి కొడుతోంది. ఈ క్రమంలో గతంలో చంద్రబాబుతో కలిసి పనిచేసినందున ఇరు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ లొ రేవంత్ రెడ్డి పై ఆరోపణల జోరు పెరిగింది.ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా రాష్ట్ర నీటి వాటాల విషయంలో తమ ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పేయడం ద్వారా బీఆర్ఎస్ విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు అనే చర్చ హస్తం పార్టీలో జరుగుతోంది. ఇక ఇప్పటికే ప్రధానితో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో భవిష్యత్ లొ బీజేపీపై విమర్శలకు రూట్ క్లియర్ చేయనుకుంటున్నారు అనే టాక్ వినిపిస్తోంది.  ఈ పొలిటికల్ వార్ లొ అంతిమంగా ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి మరి.

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Leave a Comment