ఢిల్లీ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. గ్వైర్ హాల్‌లోని క్యాంటీన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొత్తం 4 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అధికారులు విచారణ ప్రారంభించారు.
ఢిల్లీ యూనివర్సిటీలో అగ్నిప్రమాదం

For Feedback - feedback@example.com