ప్రతిపక్ష బీఆర్ఎస్ లో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనియాంశం అవుతున్నది. అధికారం దూరం అయ్యాక ఆ పార్టీకి అధికార పక్షం కంటే పాడి కౌశికి చేస్తున్న  హల్చల్  ను డిఫెన్స్ చేసుకోవడం మే పెద్ద ఛాలెంజ్ గా మారింది. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి లాడాయి విషయంలో కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు అయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్ పై దురుసుగా ప్రవర్తించారని.. అయన పీఏతో పాటు RDO మహేశ్వర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసు ఇలా మూడు కేసులు నమోదు అయ్యాయి.

రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ అగ్రిసీవ్ గా వెళ్తున్న మాట తెలిసిందే. హరీష్ రావు, కేటీఆర్ లెఫ్ట్ రైట్ గా ప్రభుత్వపై  దూకుడుగా వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డి దూకుడు పార్టీలో డిస్కషన్ గా మారుతున్నది.  ఇంతకు ముందు  అరికేపుడి గాంధీ, అసెంబ్లీ బయట పోలుసులపై, లోపల సభ్యులపై అయన వ్యవహారం పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్నాయన అభిప్రాయాలూ ఉన్నాయి.

తంలో పార్టీ ఫిరయింపులను కేసీఆర్ దగ్గరుండి ప్రోత్సాహించారనేది అందరికీ తెలిసిన ముచ్చటే. అటువంటిది పార్టీ మారిన సంజయ్ పై కౌశిక్ రెడ్డి కాయ్యానికి కాలు దువ్వడం ప్రత్యర్థుల చేతికి ఆయుధం ఇవ్వడమే అవుతుందనె అభిప్రాయాలూ బీఆర్ఎస్ లో వినిపిస్తుంది.