బిచ్చగాడితో ఓ భార్య లేచ్చిపోయిన షాకింగ్ ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. నలుగురు పిల్లల్ని, భర్తను కాదని ముష్టి వాడితో పరార్ కావడంతో సదరు భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన యూపిలోని హార్దోయి జిల్లాలో చోటు చేసుకుంది.
రాజు(45), రాజేశ్వరి (36) భార్య భర్తలు. వీరికి ఆరుగురు పిల్లలు.అయితే నాన్హ్ఏ పండిట్ (45) అనే బిచ్చగాడు అప్పుడప్పుడు భిక్షాటన కోసం వీళ్ళ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో రాజేశ్వరికి సదరు భిక్షగాడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఇద్దరి ఫోన్ నంబర్లు ఇచ్చుకోవడం, ఫోన్ లో తరచూ మాట్లాడుకోవడం వరకు వెళ్ళింది. ఈ నెల 3 వ తేదీన మధ్యాహ్నం రాజేశ్వరి కూరగాయలు తెస్తాను అని భర్తకు చెప్పి ఇంట్లో నుండి వెళ్ళింది. అలా వెళ్లిన ఆమె తిరిగి రాలేదు.
దీంతో రాజు తన భార్య బిచ్చగాడితో వెళ్ళిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఇటీవల తాను బర్రెను అమ్మిన డబ్బులను కూడా తన వెంట తీసుకువెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్వరిని కనిపెట్టారు. ఆ బిచ్చగాడి కోసం వెతుకుతున్నారు. ఇప్పుడీ ‘ముష్టి ప్రేమ కథ’ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.