మారుతున్న జీవన శైలి, కాలుష్యం వల్ల చాలా మందిని హెయిర్ ఫాల్ సమస్య వేశిస్తోంది. చిన్న వయసులోనే బట్టతల కారణంగా డిప్రెషన్ లోకి వెళ్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో బట్టతల వచ్చింది అని సూసైడ్ చేసుకున్న ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ మూడు గ్రామాల్లో వారం రోజుల్లోనే అనేక మందికి జుట్టు ఊడిపోయి బట్టతల రావడం అందరిని షాక్ కు గురి చేస్తోంది.
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని బోర్గావ్, కల్వడ్, హింగ్న గ్రామాల్లో గత కొంత కాలంగా తలపై వెంట్రుకలు రాలిపోతున్నాయి. జుట్టు బలహీనంగా మారుతోంది.కొంత మందికి వారం రోజుల్లోనే ఒత్తుగా ఉన్న జుట్టు బట్టతలగా మారడంతో మరింత టెన్షన్ పడుతున్నారు.
పరిస్థితి పట్ల అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ గ్రామాలను అధికారులు వైద్య బృందాలు సందర్శించాయి. బాధితుల నుండి షాంపిల్స్ తీసుకున్నారు. నీటి కాలుష్యం, ఎరువుల వల్ల ఇలా జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారు.