---Advertisement---

సర్పంచ్ ఎన్నికలపై రాయికోడ్ బీఆర్ఎస్ ఫోకస్.. కాంగ్రెస్ కు చెక్ పెట్టేలా ఖతర్నాక్ వ్యూహం!

By
On:
Follow Us

తెలంగాణలొ ఎన్నికల ఫీవర్ పెరుగుతోంది. ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నడుస్తుండగా మరో వైపు రోబోయే స్థానిక సంస్థలఎన్నికలకు పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి.  ఈ క్రమంలో లోకల్  బాడీ ఎలక్షన్స్ కోసం  కారు పార్టీ రేస్ పెంచుతోంది. అధినేత కేసీఆర్ ఆదేశాలతో సంగారెడ్డిజిల్లా రాయికోడ్ గులాబీ పార్టీ దండు దూకుడు పెంచింది.  స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి చెక్ పెట్టేలా మండల లీడర్ల వ్యూహలకు పదును పెడుతున్నారు.

ఆసక్తిగా మండల లీడర్ల సమావేశం:
గురువారం రాయికోడ్ మండలం మామిడిపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు మహబూబ్ పటేల్ ఆధ్వర్యంలో  బీఆర్ఎస్  పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మండల బీఆర్ఎస్ శ్రేణులు, వివిధ గ్రామాల బీఆర్ఎస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చేవెళ్ల విట్ఠల్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ ప్రతి నాయకునికి గుర్తింపు ఉంటుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్ కు దిశ నిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. అంతకుముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ శివారులోని దర్గా వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ మహబూబ్ పటేల్, మండల యూత్ అధ్యక్షుడు అంజి ముదిరాజ్, తెలంగాణ మలిదశ ఉద్యమ నేత కాశీ బస్వరాజ్ పాటిల్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఎం.అంజయ్య, ఇందూర్ సొసైటీ డైరెక్టర్ జైపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, చంద్రశేఖర్, సలీమ్ సోషల్ మీడియా వారియర్ రాజీ రెడ్డి, ఎస్సి సెల్ మండల  నాయకులు మెగులయ్య, నాయకులు మాణిక్యం, అసద్ పటేల్, అశోక్, సంగమేశ్, నర్సింహ చారి, ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సమావేశంతో మండల బీఆర్ఎస్ మరింత స్పీడ్ పెంచాబోతున్నదా? ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి నిర్మాణత్మాకంగా వెళ్లాబోతున్నాదా? అనేది మండల రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Leave a Comment