---Advertisement---

సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి సర్కార్ బిగ్ షాక్

By
On:
Follow Us

గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారి అర్హతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో బిగ్ షాక్ ఇచ్చింది. పోటీ చేసేవారు ఇద్దరికన్నా ఎక్కువ నిబంధన కలిగి ఉండరాడన్న రూల్ ను కంటిన్యూ చేయాలని ప్రభుత్వంలో నిర్ణయించింది.ఈ సారికి పాత విధానమే అమలు చేయాలని నిర్ణయించింది.ఈ నిబంధనను ఎత్తివేయాలని పంచాయతీ రాజ్ శాఖ ప్రతిపాదన వచ్చినా ప్రభుత్వంలో తిరస్కరిచింది. అయితే లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రస్తుతం వరుసగా రెండుసార్లు ఒకే సారి రిజర్వేషన్ విధానం అమలులో ఉండగా దానిని ఒక టర్మ్ కే పరిమితం చేస్తూ పంచాయతీరాజ్ (సవరణ) చట్టం -2024 కు శాశనసభ ఆమోదం తెలిపింది.  మండలిలో శనివారం ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తారనే ప్రచారంతో ఇన్నాళ్లు పోటీకి దూరం అయినా ఆశవహుళ పోటీకి కసరత్తు చేసుకుంటున్నారు. తమ గాడ్ ఫాదర్ల ద్వారా టికెట్ల కోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనూహ్యంగా ఈ సారికి పాత నిబంధనే అమలు చేయబోతుండటంతోవారి ఆశలపై నీళ్లు పోసినట్లు అయింది.

అయితే ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తే టికెట్ల విషయంలో పోటీ పెరిగి ఇబ్బందులు వస్తాయనే ప్రభుత్వం పాత నిబంధన ప్రకారం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నదా? లేక మారేదైనా సాంకేతిక కారణం ఉన్నదా అనేది అందరి నోళ్లలో నానుంతున్న ముచ్చట.

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Leave a Comment