జైల్లలో మగ్గుతున్న ఖైదీలకు హక్కులు ఉంటాయని తెలుసు. కారాగారంలో ఉన్నా వారు చేసే పనులకు అక్కడ కూలీచేసి సంపాదించుకోవచ్చు. కానీ తాజాగా తెలంగాణ జైళ్ల శాఖలో పిసినారితనం తేటతెల్లం అయింది. అతి తక్కువ వేతనంతో ఖైదీల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నట్లు సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ ఇటీవల రిలీజ్ చేసిన ప్రిజన్స్ ఇన్ ఇండియా నివేదిక పేర్కొంది.
దీని ప్రకారం తెలంగాణ జైళ్ల శాఖ నైపుణ్యం లేని ఖైదీలకు రోజుకు మరీ రూ.30 మాత్రమే చెల్లింస్తోంది. కర్ణాటకలో ఏకంగా రూ.524 చొప్పున చెల్లిస్తున్నారు. మిజోరం జైళ్లలో మరీ తక్కువగా రూ.20 చొప్పున చెల్లిస్తున్నారు. తెలంగాణ జైళ్లలో ఒక్కరూ కూడా మత్తుకు బానిసైన ఖైదీలు లేరు. తెలంగాణలో 215 మంది ఉన్నారు. తెలంగాణలో కుటుంబ వార్షికాదాయం రూ.30 వేలలోపు ఉన్న ఖైదీలే ఎక్కువ ఉన్నారు. వారి సంఖ్య 1,213 కాగా రూ.30 వేల నుంచి రూ.లక్షలోపు ఆదాయమున్న ఖైదీల స 1,147 మంది, రూ.1 లక్ష నుంచి 10 లక్షల్లోపు ఆదాయం ఉన్న ఖైదీలు 1,135 మంది ఉన్నారు. 118 మంది ఖైదీలు రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు ఉన్నారు.