---Advertisement---

ఫామ్ లోకి కేసీఆర్.. ఈ వ్యూహంతో బీజేపీ, రేవంత్ రెడ్డికి టార్గెట్

By
On:
Follow Us

బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం మళ్ళీ యాక్టివ్ అయ్యారు. దాదాపు 6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై పార్టీశ్రేణులకు దశ దిశా నూరిపోశారు. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? భవిష్యత్ లొ జరగబోయేది ఏంటి అనేది లెక్కలు తెల్చేశారు. ఈ క్రమంలో గతంలో కేసీఆర్ కు ఆయు పట్టుగా ఉన్న అంశాన్నే తాజాగా మళ్ళీ కేసీఆర్ ప్రస్థావించాడం పొలిటికల్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు:

తెలంగాణ సమాజం సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ, టీ ఆర్ ఎస్/ బి ఆర్ ఎస్ పార్టీ’ అని కేసీఆర్ చెప్పారు. అలాగే NDA ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు మరోసారి తెలంగాణాలో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారని సెన్స్షనల్ కామెంట్స్ చేశారు. గతంలో తెలంగాణ ఏర్పాటును అడ్డుపడ్డ వారిని రాష్ట్రలోకి రానివ్వొద్దు అంటూ వ్యాఖ్యణించారు. అయితే చంద్రబాబు విషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం కేసీఆర్ కు ఇదేం కొత్త కాదు.  2018అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున్న టీడీపీని చంద్రబాబును టార్గెట్ చేసి రాజకీయ లబ్ది పొందారు. ప్రస్తుతం రాష్ట్రంలో గతంలో చంద్రబాబుతో పని చేసిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు.ఏపీలో చంద్రబాబు సీఎం గా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును టార్గెట్ చేస్తే ఈ క్రమంలో అప్రయత్నంగానే  రేవంత్ రెడ్డి కూడా కార్నర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది కేసీఆర్ ఆలోచన కావొచ్చు. తెలంగాణలొ ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఇటువంటి తరుణంలో NDA రూపంలో  తెలంగాణ రాజకీయాల్లోకి చంద్రబాబు రాకను కాషాయ పార్టీ అంగీకారస్తుందా అనేది కూడా ముఖ్యమే. ఈ నేపథ్యంలో చంద్రబాబును టార్గెట్ చేస్తే ఈ క్రమంలో అప్రయత్నంగానే  రేవంత్ రెడ్డి,బీజేపీ కూడా కార్నర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది కేసీఆర్ ఆలోచన కావొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Leave a Comment