---Advertisement---

తాజా అధ్యయనం: 3 రోజులు ఫోన్ కు దూరం.. మనిషి శరీరంలో జరిగే ఊహించని మార్పులు ఇవే

By
On:
Follow Us

ఉద్యోగం, ఉపాధి లేని వాళ్ళు ఉంటారేమో కానీ మొబైల్ ఫోన్ లేని వాళ్ళను ఊహించడం ప్రస్తుత కాలంలో అసాధ్యం. అంతలా వ్యక్తుల రోజువారీ జీవితాలతో ఫోన్లలతో అవసరం, అటాచ్ మెంట్ ఏర్పడ్డాయి. ఇదే సమయంలో మనషులకు ఎంత అక్కరకు వస్తున్నాయో అంతే సమస్యగా మారుతున్నాయి. అందుకే ఫోన్లు లేని పాతరోజులే మేలు అని చాలామంది మాట్లాడుతుంటే ఈ జనరేషన్ వాళ్ళు ఓ వింతగా చూస్తుండటం నడుస్తున్న ముచ్చట. ఇదిలా ఉంటే ఫోన్ లేకుంటే మనిషి బ్రెయిన్ లొ ఎం జరుగుతుంది అని తాజాగా శాస్త్రవేతలు చేసిన ఓ అధ్యయనంలొ షాకింగ్ విషయాలు వెళ్లడయ్యాయి.

త్రీ డేస్ ఛాలెంజ్:

స్మార్ట్ వీలైనంత తక్కువ యూజ్ చేయడం వళ్ళ మన మెదడు సూపర్ యాక్టివ్ గా పనిచేస్తుంది అని జర్మనికి చెందిన కోలోగ్నే, హేయిడెల్ బర్గ్ యూనివర్సిటీ సైంటిస్ట్లు సంయుక్తంగా త్రీ డేస్ ఛాలెంజ్ అధ్యయనం నిర్వహించారు. 18 నుంచి 30 ఏళ్లలోపు 25 మందిని సెలక్ట్ చేసుకుని వారికి 72 గంటల పాటు (దాదాపు మూడు రోజులు) ఫోన్ ఇవ్వలేదు.కేవలం ఎమర్జన్సీ అయితేనే వాళ్లకు ఫోన్ పర్మిషన్ ఇచ్చారు. అలా రీసెర్చ్ కు ముందు ఆ తర్వాత వారికి ఎమ్మారై స్కాన్ చేశారు.అలాగే కొన్ని మానసిక పరీక్షలు నిర్వహించారు. అయితే ఇందులో ఫోన్ తక్కువగా వాడిన వారి మెదడు అత్యంత చురుకుగా ఉండటం గమనించారు. వ్యసనానికి సంబంధించి మెదడు క్రియాశీలతలోనూ మార్పులు గమనించారట. మొత్తంగా ఫోన్ కు దూరంగా ఉంటే బ్రెయిన్ పనితీరు మెరుగుగా ఉంటుంది అని ఓ అంచనాకు వచ్చారు. ఇటీవల హీరోయిన్ సమంత సైతం ఈ త్రీ డేస్ ఛాలెంజ్ ను చేసి తన అనుభవన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

 

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Leave a Comment