కాంగ్రెస్… దేశ రాజకీయాల్లో ఇది ఓ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మాదే గుత్తాదిపత్యం అనే స్థాయిలో రాజకీయాలు సాగించిన హస్తం పార్టీ బీజేపీ దెబ్బకు గడిచిన దశబ్ద కాలంగా ఉనికికోసం పడరాని పాట్లు పడుతుంది. ఈ దురవస్తకు ప్రత్యర్థుల ఎత్తుగడలు ఓ కారణం అయితే ఆ పార్టీ స్వయంకృతాపరాధం మరో రీజన్ అనే చర్చ బహిరంగ రహస్యం. మాజీ ప్రధాని, ఆర్థిక మాంత్రికుడు డా. మన్మోహన్ సింగ్ మరణం వేళ కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పీవీ పట్ల అలా మన్మోహన్ పట్ల ఇలా:
మన్మోహన్ సింగ్ కు రాజ్ ఘాట్ లో అంత్య క్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి చేస్తోంది.దేశానికి అయన చేసిన సేవలకు గాను ఈ డిమాండ్ న్యాయమైనదే. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అదే కాంగ్రెస్ పార్టీకి చేసిందిన మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహా రావు పట్ల వ్యవహరించిన తీరు మరో సారి తెరపైకి వస్తోంది. నాడు పీవీ మరణిస్తే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకురానివ్వకుండా ఆఫీస్ నాలుగు గేట్లు ముసివేసి హైదరాబాద్ పంపిన వైనం అందరూ గుర్తు చేసుకుంటున్నారు.
పీవీకి దక్కని గౌరవం ఆయన హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ కు ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టడం రాజకీయంగా కాంగ్రెస్ తనకు తానే ప్రత్యర్థులకు ఆయుధాలు ఇవ్వడంలో మాకు మేమే సాటి అని నిరూపించుకుంటున్నది అనే ముచ్చట అంతటా వినిపిస్తోంది. కాంగ్రెస్ ఆదిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఎలా ఉన్న మన్మోహన్ సింగ్ మరణంతో ఈ దేశం గొప్ప బిడ్డను కోల్పోయింది.