---Advertisement---

బాలీవుడు హీరో సైఫ్ అలీఖాన్ పై ఎటాక్.. ఆరు చోట్ల కత్తి పోట్లు

By
Last updated:
Follow Us

బాలీవుడ్  యాక్టర్ సైఫ్ అలీఖాన్ పై హత్యయత్నం జరిగింది.  గుర్తుతెలియని ఓ వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి డాడీ చేశాడు.కత్తితో దాడికి పాల్పడటంతో అయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు ముంబయిలొని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. ఈ డాడీలో సైఫ్ అలీఖాన్ కు ఆరు చోట్ల కత్తి గాయాలు అయ్యాయని, రెండు చోట్ల డీఫ్ గా గాయాలు అయ్యాయిని వైద్యులు తెలిపారు. చోరీ కోసం ఇంట్లోకి రాగా దుండగుడిని గమనించి అడ్డుకునే ప్రయత్నం చేయగా డాడీ చేసి పరారైనట్లు తెలుస్తోంది.

బాలీవుడు యాక్టర్ కు టెన్షన్ టెన్షన్:
ఇటీవల బాలీవుడు సెలబ్రేటీలకు బెదిరింపులు సర్వసధారణం అయ్యాయి. బిష్ణయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ ఖాన్ కు థ్రెట్ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో అయన నివాసానికి ఇటీవలే బుల్లెట్ ఫ్రూఫ్ చేయించారు. తాజాగా సైఫ్ అలీఖాన్ పై గుర్తుతెలియని దుండగుడు ఏకంగా కత్తితో దాడి చేయడం సెలబ్రేటిలను టెన్షన్ పెడుతోంది.

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Leave a Comment