తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ (Tet Exam Schedule) రిలీజ్ అయింది. జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శనివారం స్పష్టం చేశారు. జనవరి 2 నుంచి జనవరి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు పరీక్షలు నిర్వహించబోతున్నారు. టెట్ పేపర్ -1 పరీక్షలు జనవరి 8,9,10,18 తేదీలలో జరగనుండగా టెట్ పేపర్-2 పరీక్షలు జనవరి 2,11,12,19,20 తేదీలలో నిర్వహించబోతున్నారు. హాల్ టికెట్లు డిసెంబర్ 26న హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://tgtet2024.aptonline.in/tgtet/ ను సందర్శిచండి.
TG Tet Schedule: తెలంగాణ టెట్ పూర్తి షెడ్యూల్ ఇదే.. హాల్ టికెట్లు ఎప్పటి నుండి అంటే?

For Feedback - feedback@example.com